గౌతమీ: అప్పట్లో వృత్తిపరమైన జీవితానికి, వ్యక్తిగత జీవితానికి పెద్దగా తేడా ఉండేది కాదు: సినీ నటి గౌతమి

  • ఇప్పటి జనరేషన్ కు, అప్పటి జనరేషన్ కు చాలా తేడా ఉంది
  • ‘ఇది ప్రొఫెనల్.. ఇది పర్సనల్’ అనే స్పష్టత కనిపిస్తోంది
  • ఓ ఇంటర్వ్యూలో సీనియర్ నటి గౌతమి

సినిమాల విషయానికొస్తే, ఇప్పటి జనరేషన్ కు- అప్పటి జనరేషన్ కు, చాలా తేడా ఉందని ప్రముఖ సినీ నటి గౌతమి అన్నారు. ‘ఐడ్రీమ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, ‘ గతంలో అయితే, పర్సనల్ లైఫ్ కు, ప్రొఫెనల్ లైఫ్ కు పెద్దగా తేడా ఉండేది కాదు. ఎక్కడి కెళ్లినా పని, సినిమా ఇండస్ట్రీ.. ఇదే మన ప్రపంచం అనేట్టుగా గతంలో ఉండేది. ఇప్పుడు మాత్రం అలా లేదు.

ఈ జనరేషన్ లో ‘ఇది ప్రొఫెనల్.. ఇది పర్సనల్’ అనే స్పష్టత కనిపిస్తోంది. ఇలా ఉండటం చాలా మంచిది. గతంలో అయితే ఒక సెట్ లో నటీనటులందరూ కలిస్తే ఒక ఫ్యామిలీ కలిసినట్టుగా ఉండేది. అందరం కలిసి కూర్చుని, భోజనాలు చేస్తూ అన్ని విషయాలను షేర్ చేసుకునేవాళ్లం. నేను అయితే, సెట్స్ కు వెళితే ప్యాకప్ అనే వరకు కూడా బయట అడుగుపెట్టేదాన్ని కాదు. సెట్స్ లోనే కూర్చునే దాన్ని.

డైలాగ్స్ విషయంలో హెల్ప్ చేయడం, ఎడిటింగ్ నోట్స్ రాయడం, ట్రాలీ తోయడం, షాట్ చూడటం.. ఒకవేళ ఏదీ చేయకపోతే ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చునేదాన్ని. అప్పట్లోనే నాకు ఓ కార్వాన్ ఉండేది. ఆ రోజుల్లోనే ఓ టెంపో ట్రావెలర్ ని తీసుకుని మొత్తం రీమోడల్ చేసి, ఏసీతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన కార్వాన్ ని మా అమ్మ రెడీ చేయించింది. దీనిని అందరూ వచ్చి చూసేవారు. అయితే, అందులో కూర్చోవాలని నాకు ఎప్పుడూ అనిపించేది కాదు. ఇప్పటికీ, నేను షూటింగ్ కి వెళితే, కార్వాన్ ఉన్నప్పటికీ నేను బయటనే కుర్చీ వేసుకుని కూర్చుంటా’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News