కేసీఆర్: కేసీఆర్ పై అసమ్మతి, అసంతృప్తి చిన్నగా పెరుగుతున్నాయి!: కొమ్మినేని శ్రీనివాసరావు

  • అసంతృప్తి పెరగడానికి కారణం ప్రభుత్వ పథకాలు కాదు, వేరే కారణాలు  
  • తెలంగాణలో వెలమ వర్సెస్ రెడ్డి అనే అభిప్రాయం వస్తోంది
  • ఓ ఇంటర్వ్యూలో కొమ్మినేని 

సీఎం కేసీఆర్ పై అసమ్మతి, అసంతృప్తి చిన్నగా పెరుగుతున్నాయని సీనియర్ పాత్రికేయుడు కొమ్మినేని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. ‘తెలుగు పాప్యులర్ డాట్ కామ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘కేసీఆర్ పై అసమ్మతి, అసంతృప్తి పెరగడానికి ప్రభుత్వ పథకాలు లేదా ఇతర కార్యక్రమాలు కారణం కాదు, అందుకు వేరే కారణాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని వారికి ప్రాధాన్యమివ్వడం, పరిటాల సునీత కుమారుడు వివాహానికి ఇటీవల అనంతపురం వెళ్లిన కేసీఆర్ అవసరానికి మించిన వ్యవహారం చేశారనే విమర్శలు రావడం.. ఇలాంటి వాటిని తెలంగాణ సమాజం గమనిస్తూ ఉంటుంది కదా!’ అన్నారు.
 
‘తెలంగాణలో వెలమ వర్సెస్ రెడ్డి అనే అభిప్రాయం చిన్నగా వస్తోంది. మిగతా పార్టీల్లో వెలమ, రెడ్డి కులస్తులు ఉన్నప్పటికీ.. టీఆర్ఎస్ లో ఉన్న వెలమే అఫిషియల్ వెలమ, మిగతావాళ్లు కాదని, కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డే..అఫిషియల్ రెడ్డి అని, తెలుగుదేశం అంటే కమ్మ అనే అభిప్రాయం పడిపోయింది. వాస్తవంగా చెప్పాలంటే, టీఆర్ఎస్ లోనే ఎక్కువ మంది రెడ్డి కులస్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తెలంగాణలోని పది, పదిహేను నియోజకవర్గాల్లో కమ్మ కులస్తులు ప్రభావితం చేయగలరనే అంచనా ఉంది. దీనిని క్యాష్ చేసుకోవడానికి కేసీఆర్ చూస్తున్నారు’ అని కొమ్మినేని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News