కొండా సురేఖ: కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారంటూ ప్రచారం.. ఖండన!
- కొండా దంపతులు కాంగ్రెస్‌లో చేరుతున్నారని టీవీల్లో వార్తలు
- కేసీఆర్ తమకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారన్న కొండా సురేఖ దంపతులు
- పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టం
కొండా సురేఖ దంపతులు కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అవుతున్నారంటూ ప్రచారం ఊపందుకుంటోంది. టీడీపీలోంచి రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లోకి జంప్ అయిన నేపథ్యంలో టీఆర్ఎస్ నుంచి కూడా కొందరు ఎమ్మెల్యేలు చేరుతున్నారని టీవీల్లో వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై స్పందించిన కొండా సురేఖ, మురళి ఆ వార్తలను ఖండించారు. తాము పార్టీ మారే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. పార్టీ మారతామంటూ వస్తోన్న ప్రచారం రాజకీయ కుట్రేనని తేల్చి చెప్పారు. కేసీఆర్ తమకు రాజకీయ పునర్జన్మ ఇచ్చారని, అటువంటి పార్టీ నుంచి తాము ఎందుకు వెళతామని వారు వ్యాఖ్యానించారు.