వర్మ: బాగా చెప్పావు నాగ్.. ఇప్పుడు మన పాత్రలు తారుమారయ్యాయి!: దర్శకుడు వర్మ
- నాగార్జున ట్వీట్ పై స్పందించిన వర్మ
- నువ్వు తక్కువ మాట్లాడతావు..నేను ఎక్కువ మాట్లాడతా
- ఇప్పుడు మాత్రం మన పాత్రలు తారుమారయ్యాయి
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ విషయమై నాగ్ చేసిన ట్వీట్ కు వర్మ స్పందించారు. ‘బాగా చెప్పావు నాగ్, ... మొట్టమొదటిసారిగా, నా కెరీర్ లో నేను చెబుతున్నా.. ఈ సినిమా గురించి ఒక్కముక్క కూడా నేను మాట్లాడను..నా సినిమానే మాట్లాడుతుంది’ అని పేర్కొన్నారు.
మరో ట్వీట్ లో ‘హే నాగ్, నువ్వు ఎప్పుడూ తక్కువ మాట్లాడతావు, నేను ఎక్కువ మాట్లాడతాను. ఇప్పుడు మాత్రం, మన పాత్రలు తారుమారయ్యాయి..’ అని వర్మ అన్నారు. కాగా, ఈ నెల 20 వర్మ-నాగార్జున కాంబినేషన్ లో కొత్త చిత్రం ప్రారంభోత్సవం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరగనుంది.