టీఆర్ఎస్ నేత‌: డ్రంకెన్ డ్రైవ్‌.. ప‌ట్టుబ‌డ్డ టీఆర్ఎస్ నేత!

  • కాజీపేట వ‌ద్ద ఘ‌ట‌న‌
  • మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ ప‌ట్టుబ‌డ్డ మోతీలాల్‌ నాయక్‌
  • టీఆర్ఎస్ నేత ఎంత‌గా వాదించినా వ‌ద‌లని ట్రాఫిక్‌ పోలీసు
  • డ్రంకెన్ డ్రైవ్‌, రాష్ డ్రైవింగ్ కింద కేసుల న‌మోదు

మ‌ద్యం తాగి వాహ‌నం న‌డుపుతూ టీఆర్‌ఎస్ నేత‌ మోతీలాల్‌ నాయక్‌ నిన్న‌ రాత్రి కాజీపేట ట్రాఫిక్‌ సిగ్నల్‌ వద్ద పోలీసులకు ప‌ట్టుబ‌డ్డాడు. పోలీసులు ఆయ‌న వాహ‌నాన్ని ఆపి బ్రీత్‌ ఎనలైజ్‌ టెస్టును నిర్వహించేందుకు ప్రయత్నించగా మోతీలాల్ పోలీసుల‌ను బెదిరించే ప్ర‌య‌త్నం చేశాడు. తాను అధికార పార్టీకి చెందిన కార్పొరేటర్‌నని అన్నాడు. అయిన‌ప్ప‌టికీ నిబ‌ద్ధ‌త‌తో విధులు నిర్వ‌ర్తిస్తోన్న ట్రాఫిక్‌ ఎస్‌ఐ ఏ మాత్రం బెద‌ర‌లేదు. దీంతో మోతీలాల్ తాను హోం మినిస్టర్ నాయిని న‌ర్సింహారెడ్డిని కలిసేందుకు వెళ్తున్నాన‌ని చెప్పుకొచ్చాడు. ఆయ‌న వెంట‌నే ఉన్న ఇత‌ర‌ టీఆర్‌ఎస్‌ నేతలు కూడా స‌ద‌రు ఎస్ఐతో గొడ‌వ పెట్టుకున్నారు.

అయిన‌ప్ప‌టికీ ఆ ఎస్ఐ వ‌ద‌ల‌లేదు. అక్క‌డ పెద్ద గొడ‌వ చెల‌రేగుతుండ‌డంతో స్థానికులంతా వ‌చ్చారు. చివ‌రికి ఆ పోలీసు అస్స‌లు వ‌ద‌ల‌క‌పోవ‌డంతో మోతీలాల్ దిగివ‌చ్చాడు. ఆయ‌న‌కు బ్రీత్‌ ఎనలైజ్‌ టెస్ట్‌ చేయగా ఏకంగా 72 శాతం మద్యం తాగినట్టు పోలీసుల‌కు తెలిసింది. ఆయ‌న‌పై డ్రంకెన్ డ్రైవ్, ర్యాష్‌ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News