: మంత్రుల రాజీనామాకు బీజేపీ పట్టు
యూపీఏ సర్కారుకు మంత్రుల వ్యవహారం తలనొప్పులు సృష్టిస్తోంది. బొగ్గు కుంభకోణంలో న్యాయశాఖ మంత్రి అశ్విన్ కుమార్, మేనల్లుడి నిర్వాకంతో రైల్వే మంత్రి పవన్ కుమార్ బన్సల్.. ఇద్దరూ తీవ్ర ఆరోపణలెదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మంత్రులిద్దరినీ పదవుల నుంచి తప్పించాలని బీజేపీ పట్టుబట్టింది. లేకపోతే లోక్ సభను సజావుగా జరగనీయబోమని హెచ్చరించింది. తక్షణమే మంత్రులు రాజీనామా ప్రకటించాలని బీజేపీ సీనియర్ నేత సుష్మా స్వరాజ్ డిమాండ్ చేశారు.
కాగా, మంత్రుల రాజీనామాపై ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. నేటి సభలో సర్కారు.. విపక్షాల అభ్యంతరాల నడుమ ఆహార భద్రత బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.