నిఖిల్: నంద్యాలలో సందడి చేసిన నటులు నిఖిల్, ప్రణీత.. చూడడానికి ఎగబడ్డ స్థానికులు!
- ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొన్న నటులు
- సెల్ఫీలు తీసుకున్న అభిమానులు
- కృతజ్ఞతలు చెప్పిన నిఖిల్
కర్నూలు జిల్లాలోని నంద్యాలలో సినీనటులు నిఖిల్, ప్రణీత సందడి చేశారు. ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొని అక్కడి అభిమానులతో సెల్ఫీలకు పోజులిచ్చారు. తమ ప్రాంతానికి సినీనటులు వచ్చారని తెలుసుకున్న స్థానికులు వారిని చూడడానికి భారీగా తరలివచ్చారు. తమకు మంచి ఆతిథ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలని నిఖిల్ పేర్కొన్నాడు. నటి ప్రణీతతో కలిసి నంద్యాలలో వీరభద్ర స్వామి మాల్ ఓపెనింగ్‌కి వెళ్లానని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. వరుస హిట్‌లతో దూసుకుపోతోన్న నిఖిల్ సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.