మోత్కుప‌ల్లి న‌ర్సింహులు: కేసీఆర్.. ఇల్లు క‌ట్టుకున్నావు బాగానే ఉంది.. పేదోడికి ఇల్లు క‌ట్టిస్తున్నావా?: మోత్కుప‌ల్లి న‌ర్సింహులు

  • ఎంతో మంది న‌మ్మ‌క‌ద్రోహులు వెళ్లిపోయారు.. ఏం న‌ష్టం లేదు
  • చ‌ంద్ర‌బాబు క్యాబినెట్‌లో అన్ని కులాల వారు ఉన్నారు
  • కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఒక్క మాదిగ‌, మాల బిడ్డ కూడా లేడు, ఒక్క మ‌హిళా లేదు

త‌మ పార్టీ పెట్టినప్ప‌టి నుంచి ఇప్ప‌టివ‌ర‌కు ఎంతో మంది న‌మ్మ‌క ద్రోహులు వెళ్లిపోయార‌ని, ఎవ‌రో ఒక‌రు వెళ్లినంత మాత్రాన పార్టీకి ఏం న‌ష్టంలేదని టీటీడీపీ నేత‌ మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ భ‌వ‌న్‌లో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, టీడీపీ జాతీయాధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడి అధ్య‌క్ష‌త‌న టీడీపీ విస్తృత స్థాయి స‌మావేశం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా మోత్కుప‌ల్లి మాట్లాడుతూ... పేద‌వాళ్ల‌కి ఇళ్లు క‌ట్టించి ఇవ్వాల‌న్న ఆలోచ‌న ఎన్టీఆర్‌దేన‌ని, ఆయ‌నే ఈ కార్య‌క్ర‌మాన్ని మొద‌టిసారిగా ప్రారంభించార‌ని అన్నారు.

పేద‌వారికి ఇళ్లు ఏ ప్ర‌భుత్వం క‌ట్టినా అది ఎన్టీఆర్ ఆలోచనగానే భావిస్తామ‌ని మోత్కుప‌ల్లి న‌ర్సింహులు అన్నారు. ఆ సిద్ధాంతం త‌మ పార్టీ నుంచి పుట్టిందేన‌ని చెప్పారు. బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల వారి కోసం కృషి చేసిన ఏకైక పార్టీ తెలుగు దేశం పార్టీ అని అన్నారు. ఇప్పుడున్న ప్ర‌భుత్వం పేద‌వాడికి ఒక్క ఇల్లు కూడా ఇవ్వ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు. 'కేసీఆర్! నువ్వు ఇల్లు క‌ట్టుకున్నావు బాగానే ఉంది.. పేదోడికి ఇల్లు క‌ట్టిస్తున్నావా? చ‌ంద్ర‌బాబు క్యాబినెట్‌లో అన్ని కులాల వారు ఉన్నారు... కేసీఆర్ మంత్రివ‌ర్గంలో ఒక్క మాదిగ‌, మాల బిడ్డ కూడా లేడు, ఒక్క మ‌హిళ కూడా లేదు... సామాజిక న్యాయం పాటించ‌డం లేదు..' అని మోత్కుప‌ల్లి వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News