up: రాయ్‌బ‌రేలీలో ఘోర ప్ర‌మాదం.. 10 మంది మృతి... 60 మందికి పైగా గాయాలు

  • ఉంచాహార్‌ ఎన్టీపీసీ ప్లాంట్‌లో బాయిల‌ర్ పైప్ పేలుడు
  • గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించిన స‌హాయ‌క బృందాలు
  • 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే బాయిలర్ వద్ద పేలుడు

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని రాయ్‌బ‌రేలీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఉంచాహార్‌ ఎన్టీపీసీ ప్లాంట్‌లో బాయిల‌ర్ పైప్ పేలుడు సంభ‌వించ‌డంతో 10 మంది అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మ‌రో 60 మందికి పైగా కార్మికులకు గాయాల‌య్యాయి. వెంట‌నే అక్క‌డ‌కు చేరుకున్న స‌హాయ‌క బృందాలు గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించాయి. 500 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి చేసే బాయిలర్ వద్ద ఈ పేలుడు జరిగిందని అక్క‌డి అధికారులు వివ‌రించారు.

ఈ ఘ‌ట‌న‌లో ప్రాణాలు కోల్పోయిన‌ వారి కుటుంబాలకు ఉత్త‌ర‌ప్ర‌దేశ్ స‌ర్కారు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాల‌కు ప్ర‌గాఢ‌ సానుభూతి తెలుపుతున్న‌ట్లు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్ పేర్కొన్నారు.

up
  • Loading...

More Telugu News