‘జై సింహా’: ‘జై సింహా’ ఫస్ట్ లుక్ విడుదల!
- ‘జై సింహా’ ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
- బాలకృష్ణ 102వ చిత్రం
- ‘గర్జిస్తున్న ‘జై సింహా’ ఇక్కడున్నాడు’ : ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం ప్రశంసలు
కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘జై సింహా’ ఫస్ట్ లుక్ విడుదలైంది. కొంచెం సేపటి క్రితం చిత్ర యూనిట్ దీనిని విడుదల చేసింది. కాగా, ‘ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన ఫేస్ బుక్ ఖాతాలో జై సింహా’ ఫస్ట్ లుక్ ని పోస్ట్ చేశారు. ‘గర్జిస్తున్న ‘జై సింహా’ ఇక్కడున్నాడు. కేఎస్ రవికుమార్, నిర్మాత సి. కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చినఎన్ బీకే 102వ చిత్రం ‘జై సింహా’ మోషన్ పోస్టర్’ అని ఆ పోస్ట్ లో బ్రహ్మానందం పేర్కొన్నారు.