కేసీఆర్: సీఎం కేసీఆర్ కంటే వాళ్లిద్దరే బెటర్!: దాసోజు శ్రవణ్ కుమార్
- మాజీ సీఎంలు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డితో కేసీఆర్ ని పోల్చి చూస్తూ కాంగ్రెస్ నేత విమర్శలు
- కోదండరామ్ దీక్షకు ప్రభుత్వం ఎందుకు అనుమతివ్వరు
- ‘ఆయనేమన్నా నక్సలైటా?’ అని ప్రశ్నించిన దాసోజు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలతో తెలంగాణ సీఎం కేసీఆర్ ను పోల్చి చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్రవణ్ కుమార్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కంటే రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డినే బెటర్ అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో ఉద్యోగాల నియామకాల విషయంలో కేసీఆర్ సర్కార్ చేస్తున్న జాప్యాన్ని నిరసిస్తూ జేఏసీ నేత కోదండరామ్ తన ఇంటి వద్ద ఒక్కరోజు దీక్ష చేపట్టిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కోదండరామ్ ఏమైనా నక్సలైటా? ఆయన దీక్షకు ఎందుకు అనుమతివ్వడం లేదు? అని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే జేఏసీ రాజకీయంగా బలపడాలని, రాజకీయంగా కోదండరామ్ ఎదగాలని ఆయన అన్నారు.