పృథ్వీరాజ్: అప్పట్లో కులాల గురించి నాకు తెలియదు: ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్

  • ఉద్యోగ, సినీ ప్రయత్నాలు ప్రారంభించాకే కులాల గురించి నాకు తెలిసింది
  • కులం కూడు పెట్టదు
  • ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్

డిగ్రీ చదివేటప్పుడు, యూనివర్శిటీలో ఎంఏ చేసేటప్పుడు కూడా తనకు కులాల గురించి తెలియదని ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘తెలుగు వన్’ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఓసారి పోలీస్ రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్షలకు వెళ్లిన సమయంలో అక్కడి అధికారి ఒకరు ‘నువ్వు ఓసీ అయ్యా, నీకు ఉద్యోగం రాదు’ అన్నారు. ఈ విషయాన్ని మా అమ్మమ్మకు చెబితే ‘మన ఊళ్లోనే గుమాస్తా ఉద్యోగం చేసుకోవచ్చులే’ అని చెప్పిందంటూ నాటి విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.

ఆంధ్రా యూనివర్శిటీలో తన ఎంఏ పూర్తయిన తర్వాత ఉద్యోగ, సినీ ప్రయత్నాల నిమిత్తం చెన్నై, హైదరాబాద్ లలో తిరిగిన సందర్భంలో ఈ కులాలు, కుంపట్లు, వర్గాలు..మొదలైన విషయాలు తెలిసి ఆశ్చర్యపోయానని అన్నారు. ఎప్పుడైనా సరే, కులం కూడు పెట్టదని, మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు జరగాలని తాను కోరుకుంటున్నానని, మారుతున్న కాలం ప్రకారం వృత్తులు కూడా మారుతున్నాయని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News