అనసూయ: బేకరీలో నవ్వులు చిందిస్తున్న అనసూయ-రష్మీ!
- ఓ బేకరీలో కేక్ తిన్న అనసూయ-రష్మీ
- నవ్వులు చిందిస్తున్న అందాల భామలు
- ‘ఇన్ స్టా గ్రామ్’లో ఫొటోలు పోస్ట్ చేసిన అనసూయ
ప్రముఖ యాంకర్లు అనసూయ, రష్మీ కలిసి దిగిన ఓ ఫొటో ఆసక్తికరంగా ఉంది. ఓ బేకరీలో తమకు ఇష్టమైన కేక్ తింటూ సెలబ్రేట్ చేసుకున్నామంటూ అనసూయ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పేర్కొంది. ఆ బేకరీలో ఓ టేబుల్ వద్ద అనసూయ, రష్మీ నవ్వులు చిందిస్తూ కూర్చుని ఉన్నారు. హాలోవీన్ కేక్ అన్నా, ఆ కేక్ తింటున్న ప్రదేశమన్నా తనకెంతో ఇష్టమని అనసూయ చెప్పింది. ఈ సందర్భంగా రష్మీ కొత్త చిత్రం ‘నెక్స్ట్ నువ్వే’ కు బెస్ట్ ఆఫ్ లక్ చెప్పిన అనసూయ, ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇస్ స్టా గ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.