చంద్రబాబు: చంద్రబాబు గారిని చూసి నా పర్సనల్ బిహేవియర్ ను మార్చుకున్నాను!: వై.సాయిబాబు

  • ఒక విషయంపై అందరి అభిప్రాయాలను చంద్రబాబు అడుగుతారు
  • ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా
  • నా పర్సనల్ బిహేవియర్ లో కొన్నింటిని మార్చుకున్నా
  •  ఆసక్తికర విషయాలు చెప్పిన బాబు సన్నిహిత బృందంలో సభ్యుడు సాయిబాబు

ఏదైనా ఒక విషయం మీద మనం మాట్లాడుతున్నప్పుడు మన అభిప్రాయాన్ని చెప్పడానికి మంచి అవకాశం ఇస్తారంటూ ఏపీ సీఎం చంద్రబాబుపై వై.సాయిబాబు ప్రశంసలు కురిపించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సన్నిహిత బృందంలో సభ్యుడు, 20 సూత్రాల కమిటీ చైర్మన్ గా పని చేసిన ఆర్థిక నిపుణుడు అయిన సాయిబాబు యూట్యూబ్ ఛానెల్ ‘తెలగు పాపులర్. కామ్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.

‘ఏదైనా ఒక విషయంపై చంద్రబాబుగారు అందరి అభిప్రాయాలు తీసుకుంటారు. ఫుల్ టైమ్ పొలిటీయన్స్ తో, నా లాంటి ప్రొఫెనల్స్ తో, కింద వర్గాల వారితో మాట్లాడి, మీడియా వర్గాల అభిప్రాయాలను తీసుకుని మరింత మెరుగ్గా పని చేసేందుకు చంద్రబాబు చూస్తారు. చంద్రబాబు గారిని చూసి నా పర్సనల్ బిహేవియర్ కు సంబంధించి కొన్నింటిని మార్చుకున్నాను.

 మీకో విషయం చెబుతాను.. బహుశ 2009లోనో, 2010 లోనో .. సార్ (చంద్రబాబు) బెంగళూరో..ఎక్కడికో వెళుతుంటే అనుకోకుండా నేను కూడా ఆయనతో పాటు ఎయిర్ పోర్ట్ కి వెళ్లాను. అక్కడ లాంజ్ లో కూర్చున్నాం. జనరల్ గా అలాంటి సమయాల్లో ఆయన లెమన్ టీ ప్రిఫర్ చేస్తారు. రెండు లెమన్ టీ తీసుకురమ్మనమని నేను అక్కడ వారికి చెప్పాను. ఒక సోఫాలో సార్, మరో సోఫాలో నేను ఎదురెదురుగా కూర్చున్నాం. మా మధ్యలో పెద్ద టీపాయ్ ఉంది. బిస్కెట్లు ఉన్న ఓ ప్లేట్ తీసుకొచ్చి పెట్టారు. ఎవరి టీ వారి ముందు పెట్టారు. సార్, బిస్కెట్ల లాంటివి సహజంగా తినరు. ఆరోజున ఎందుకో ఓ బిస్కెట్ ఆయన తిన్నారు. నన్ను కూడా తీసుకోమన్నారు. ‘వద్దు సార్, నేను టీ తాగుతాను’ అని చెప్పా. మరి, ఎందుకో నాకు తెలియదు, ఆయన  వంగి..ఆ ప్లేట్ ని ముందుకి తోశారు" అని నాటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు.

‘అప్పటికే, ప్రొఫెనల్ గా నేను పదిహేను సంవత్సరాలు పూర్తి చేసుకున్నా. నా ఆఫీసులోకి నా క్లయింట్లో, వెల్ విషర్సో వచ్చి నా ముందు కూర్చుంటారు. వాళ్లకి స్నాక్స్ ఇస్తుంటాం. ఆయా సందర్భాల్లో ‘స్నాక్స్ తీసుకోండి’ అని నేను అంటానే తప్పా, నేను వంగి ఆ ప్లేట్ ని ముందుకు జరపడమనేది ఇంతవరకూ ఎప్పుడూ చేయలేదు. అలాంటిది, అంత గొప్ప వ్యక్తి  అయిన చంద్రబాబు గారు ఆ ప్లేట్ ని నా ముందుకు జరపడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సంఘటనతో ‘మన బిహేవియర్ ని కూడా మార్చుకోవాల్సిన అవసరం ఉందా!’ అని నాకు అప్పుడు అనిపించింది. అప్పటి నుంచి ఆయన్ని నేను గమనించడం మొదలుపెట్టా’ అని సాయిబాబు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News