: మార్చ్ 2 న సమైక్యాంధ్ర సింహగర్జన
సమైక్యాంధ్ర ఉద్యమం ఊపందుకుంటోంది. సమైక్యాంధ్ర ఆవశ్యకతను వివరిస్తూ భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సమైక్యాంధ్ర సంరక్షణ సమితి ఆధ్వర్యంలో మార్చ్ రెండున 'సింహగార్జన' పేరిట ఈ భారీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని చినకాకానిలో ఈ సభ నిర్వహిస్తారు. అక్కడి ఎన్నారై ఆసుపత్రి పక్కన గల ఇరవై ఎకరాల సువిశాల స్థలంలో ఉదయం 10 నుంచి సాయంకాలం 5 వరకు ఈ సదస్సు జరుగుతుంది.
పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, కావూరి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ లతో బాటు, సీమాంధ్ర లోని 117 మంది ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. సమైక్యాంధ్ర ఐకాస ప్రతినిథులు, విద్యార్ధులు, న్యాయవాదులు, మహిళలు, ఉద్యోగులు, 10 విశ్వ విద్యాలయాల నుంచి విద్యార్ధులు ఈ భారీ సమావేశానికి విచ్చేస్తారని సమైక్యాంధ్ర సంరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు షేక్ జలీల్ తెలిపారు.