ఖుష్బూ: నేను శస్త్రచికిత్స చేయించుకోనున్నట్టు వస్తున్న వార్తలు నిజమే!: సినీ నటి ఖుష్బూ

  • ఓ ట్వీట్ చేసిన ఖుష్బూ
  • 4వ తేదీన శస్త్రచికిత్స
  • రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి
  • నాపై అభిమానానికి ధన్యవాదాలు

ప్రముఖ సినీ నటి ఖుష్బూ శస్త్రచికిత్స చేయించుకుంటోందంటూ వస్తున్న వార్తలపై ఆమె స్పందించారు. సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న ఆ ప్రచారం వాస్తవమేనని ఓ ట్వీట్ ద్వారా ఖుష్బూ స్పష్టం చేసింది.

 ‘ఓకే ఫ్రెండ్స్, నేను ఆసుపత్రిలో చేరబోతున్నట్టు చాలా వార్తలు రాశారు. అవును, నేను శస్త్రచికిత్స చేయించుకోబోతున్నా. 4వ తేదీన శస్త్రచికిత్స నిర్వహిస్తారు. రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. మీ అభిమానానికి నా ధన్యవాదాలు’ అని ఆ ట్వీట్ లో ఆమె పేర్కొంది. కాగా, త్రివిక్రమ్-పవన్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రంలో ఖుష్బూ ఓ పాత్రలో నటిస్తోంది. పవన్ సరసన కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయేల్ నాయికలుగా నటిస్తున్నారు.

  • Loading...

More Telugu News