రష్మీ: సినిమాల్లో కొంచెం మాస్ మసాలా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారు!: సినీ నటి,యాంకర్ రష్మీ
- గ్లామర్ పాత్రల్లో నటించేందుకు నాకు అభ్యంతరం లేదు
- నిర్మాణ సంస్థ, దర్శకుడిని దృష్టిలో పెట్టుకున్నాకే సినిమా అంగీకరిస్తా
- తాజా ఇంటర్వ్యూలో రష్మీ
వృత్తి రీత్యా బిజీగా ఉండటం చాలా అదృష్టంగా భావిస్తున్నానని ప్రముఖ సినీ నటి, టీవీ యాంకర్ రష్మీ పేర్కొంది. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తను ప్రధాన పాత్ర పోషించిన ‘నెక్స్ట్ నువ్వే’ చిత్రం గురించి ప్రస్తావించింది. గ్లామర్ పాత్రల్లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ, సరైన నిర్మాణ సంస్థ, దర్శకుడిని దృష్టిలో పెట్టుకుని అటువంటి పాత్రలను అంగీకరించడం జరుగుతుందని చెప్పింది.
గతంలో వచ్చిన ‘గుంటూరు టాకీస్’ చిత్రంలో తాను పోషించిన పాత్రలో ఎటువంటి అసభ్యత లేదని చెప్పిన రష్మీ, అభిమానులు, ప్రేక్షకులు కూడా అదేవిధంగా భావించారని చెప్పింది. కొన్ని సినిమాల్లో తాను పోషించిన పాత్రల్లో వల్గారిటీ ఉందని, ఆయా పాత్రల్లో తనను అలా చూపిస్తారని ఊహించలేదనే విషయాన్ని బహిరంగంగానే గతంలో చెప్పానని తెలిపింది. సినిమాల్లో కొంచెం మాస్ మసాలా ఉంటేనే ప్రేక్షకులు ఇష్టపడతారని రష్మీ చెప్పుకొచ్చింది.