రేవంత్ రెడ్డి: రేవంత్ రెడ్డి చేరికను ఆహ్వానిస్తున్నాం: టీ కాంగ్రెస్ నేతలు

  • మీడియాతో మాట్లాడిన దానం నాగేందర్, డీకే అరుణ
  • రేవంత్ కు ఎలాంటి పదవులిచ్చినా స్వాగతిస్తాం
  • పార్టీలో మా పాత్ర ఎలా ఉందో, రేవంత్ పాత్ర కూడా అలానే ఉంటుంది

టీడీపీ మాజీ నేత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దానం నాగేందర్ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డి చేరికను స్వాగతిస్తున్నామని, రేవంత్ రెడ్డికి ఎలాంటి పదవులు ఇచ్చినా స్వాగతిస్తామని, రేవంత్ రాజీనామాతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ఆమోదించాలని అన్నారు. మరో నేత డీకే అరుణ మాట్లాడుతూ, రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లోకి స్వాగతిస్తున్నామని, పార్టీలో తమ పాత్ర ఎలా ఉందో, రేవంత్ పాత్ర కూడా అలాగే ఉంటుందని చెప్పారు.  

  • Loading...

More Telugu News