నాగబాబు: నాగబాబు బర్త్ డే .. ఆకట్టుకుంటున్న అభిమాని పోస్ట్ చేసిన ఫొటో!
- నాగబాబుకు బర్త్ డే విషెస్ చెప్పిన అభిమానులు
- ‘మెగా’ సోదరులు కలిసి ఉన్న నాటి ఫోటోలను పోస్ట్ చేసిన అభిమానులు
- ఆకట్టుకుంటున్న ఓ ఫొటో!
ఈరోజు నాగబాబు బర్త్ డే. ఈ సందర్భంగా నాగబాబుకు పలువురు సినీ ప్రముఖులు, ఆయన కుటుంబసభ్యులు బర్త్ డే విషెస్ చెప్పారు. ఈ సందర్భంగా ఓ అభిమాని సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోలో ఓ క్రికెట్ మ్యాచ్ ని తిలకిస్తున్న ‘మెగా’ సోదరులు, రామ్ చరణ్, హాస్యనటుడు బ్రహ్మానందం ఉన్నారు. చిరంజీవి, నాగబాబుకి మధ్యలో పవన్ కల్యాణ్ కూర్చుని ఉన్నారు. నాగబాబు ముందు రామ్ చరణ్, చిరంజీవి ముందు బ్రహ్మానందం కూర్చుని ఉన్న నాటి ఫొటోను ఆ అభిమాని పోస్ట్ చేయడం గమనార్హం.