రోహిత్: రాణిస్తున్న రోహిత్-కోహ్లీ భాగస్వామ్యం

  • సెంచరీ దిశగా రోహిత్
  • హాఫ్ సెంచరీ పూర్తి చేసిన కోహ్లీ
  • దూసుకుపోతున్న రోహిత్-కోహ్లీ భాగస్వామ్యం

మూడో వన్డేలో టీమిండియా ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల భాగస్వామ్యం రాణిస్తోంది. ఇప్పటికే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన రోహిత్ సెంచరీ దిశగా పరుగులు తీస్తున్నాడు. కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. శిఖర్ ధావన్ ఔట్ అయిన తర్వాత బరిలోకి దిగిన కోహ్లీ, రోహిత్ శర్మతో జత కట్టాడు. వీరి భాగస్వామ్యం దూసుకెళ్తోంది.

ఈ క్రమంలో 25 ఓవర్లు ముగిసే సరికి ఒక వికెట్ కోల్పోయిన టీమిండియా 140 పరుగులు చేసింది. కాగా, మూడు వన్డే మ్యాచ్ ల సిరీస్ లో చెరో మ్యాచ్ లో విజయం సాధించి సమఉజ్జీలుగా ఉన్న రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కానుంది. ఈ మ్యాచ్ లో నెగ్గి సిరీస్ అందుకోవాలని రెండు జట్లు ఉత్సాహంగా ఉన్నాయి.

  • Loading...

More Telugu News