మాధవన్: నటుడు మాధవన్ కి అరుదైన గౌరవం!
- కెనడా ప్రభుత్వం ఆహ్వానం
- పార్లమెంట్ ను సందర్శించిన మాధవన్
- ఫొటోలను పోస్ట్ చేసిన దక్షిణాది నటుడు
దక్షిణాది నటుడు మాధవన్ కు అరుదైన గౌరవం లభించింది. తమ పార్లమెంట్ ను సందర్శించాలన్న కెనడా ప్రభుత్వం ఆహ్వానం మేరకు మాధవన్ అక్కడికి వెళ్లాడు. ఒట్టావాలో ఆయనకు ఘనస్వాగతం లభించిందని, ఇండో-కెనడియన్ మంత్రులు బర్దిష్ చగ్గెర్, నవదీప్ బెయిన్స్ లు మాధవన్ ని దగ్గరుండి పార్లమెంట్ కు తీసుకెళ్లారని భారత హై కమిషనర్ వికాస్ స్వరూప్ పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. మొత్తం పార్లమెంట్ ను సందర్శించానని, ప్రముఖులతో ఫొటోలు దిగానని సామాజిక మాధ్యమాల్లోని తన ఖాతాల్లో పేర్కొన్న మాధవన్, ఇందుకు సంబంధించిన ఫొటోలను పోస్ట్ చేశాడు. హౌస్ ఆఫ్ కామన్స్ స్పీకర్ చెయిర్ లో మాధవన్ కూర్చున్న ఫొటో ప్రత్యేకంగా ఉంది. కాగా, ఈ సందర్భంగా కెనడా మంత్రి షాంపైన్ కు మాధవన్ తన ధన్యవాదాలు చెప్పాడు.