సీపీఐ: సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణకు తప్పిన ప్రమాదం!

  • పశ్చిమగోదావరి జిల్లాలో సంఘటన
  • రామకృష్ణ ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టిన మరోకారు
  • దెబ్బతిన్న కారు..సురక్షితంగా బయటపడ్డ రామకృష్ణ

సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. పశ్చిమగోదావరి జిల్లా బొమ్ములూరు వద్ద రామకృష్ణ ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. కారు మాత్రం బాగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

  • Loading...

More Telugu News