చంద్రబాబు: ధన్యవాదాలు సార్, మీ బిడ్డలా నన్ను చూసుకున్నారు!: చంద్రబాబుతో రేవంత్

  • చంద్రబాబుకు చేతులు జోడించి నమస్కరించిన రేవంత్
  • ‘లోపలికి వెళ్లి కూర్చుని మాట్లాడుకుందాం’ అన్న చంద్రబాబు
  • అయినా, బయటకు వచ్చేసిన రేవంత్

‘ధన్యవాదాలు సార్, మీ బిడ్డలా నన్ను చూసుకున్నారు. ఇక వెళ్లొస్తాను’ అని టీడీపీ అధినేత చంద్రబాబుకి రేవంత్ రెడ్డి చేతులు జోడించి నమస్కరించారు. ఏపీ సీఎంఓ కార్యాలయంలో ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశానికి వచ్చే సమయంలో చంద్రబాబుకు రేవంత్ రెడ్డి చేతులు జోడించి నమస్కరించారు.

రేవంత్ వ్యాఖ్యలకు స్పందించిన చంద్రబాబు, ‘లోపలికి వెళ్లి కూర్చుని మాట్లాడుకుందాం’ అని రేవంత్ తో అన్నారు. చంద్రబాబుకు పాదాభివందనం చేసిన మరో టీటీడీపీ నేత వేం నరేందర్ రెడ్డి, ‘వస్తాం సార్’ అంటూ చేతులు జోడించి నమస్కరించారు. లోపలికి వెళ్లి మాట్లాడుకుందామని చంద్రబాబు చెప్పినప్పటికీ, తమ రాజీనామా లేఖలను సీఎం పీఎస్‌కు ఇచ్చి రేవంత్, నరేందర్ రెడ్డి వెంటనే బయటకు వచ్చేశారు.

  • Loading...

More Telugu News