నామా నాగేశ్వరరావు: మహిళ చేసిన ఆరోపణలపై స్పందించిన నామా నాగేశ్వరరావు!

  • విజయవాడలో మీడియాతో మాట్లాడిన నామా
  • ఈ విషయం ఇప్పుడే నాకు తెలిసింది
  • నేనెవరినీ బెదిరించలేదు
  • ఈ కేసు రాజకీయం ఏంటో?

తన నగ్న చిత్రాలను బయటపెడతానని బెదిరిస్తున్నారంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేత నామా నాగేశ్వరరావుపై హైదరాబాద్, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నామా నాగేశ్వరరావు స్పందిస్తూ, టీడీపీ సమావేశం ఉండటంతో విజయవాడ వచ్చానని, ఈ విషయం తనకు ఇప్పుడే తెలిసిందని చెప్పారు. తానెవరినీ బెదిరించలేదని, ఈ కేసు వెనుక ఉన్న రాజకీయం ఏంటో తనకు తెలియదని, న్యాయపరంగానే తాను దీనిని ఎదుర్కొంటానని తెలిపారు. వాస్తవాలన్నీ త్వరలోనే బయటకొస్తాయని, ఒకరిని బ్లాక్ మెయిల్ చేయాల్సిన అవసరం తనకు లేదని, నలుగురికి సాయం చేసే మనస్తత్వం తనదని అన్నారు.

  • Loading...

More Telugu News