లతా రజనీకాంత్: ‘రోబో 2.0’కు నా భర్త పడిన శ్రమకు సెల్యూట్ చేయాలి: లతా రజనీకాంత్

  • నా భర్తను చూస్తుంటే  నాకు ఎంతో గర్వంగా ఉంది
  • ‘రోబో 2.0’ చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు 
  • ఆడియో వేడుకలో లతా రజనీకాంత్

‘రోబో 2.0’కు తన భర్త పడిన శ్రమను, ఆయన చూపిన అంకిత భావానికి సెల్యూట్ చేయాలంటూ రజనీకాంత్ పై ఆయన సతీమణి లతా రజనీకాంత్ ప్రశంసలు కురిపించారు. తన భర్తను చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని పేర్కొన్న లతా రజనీకాంత్, ఈ చిత్ర దర్శకుడు శంకర్, సంగీత దర్శకుడు రెహమాన్, నటి అమీజాక్సన్ లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రాన్ని ప్రతి ఒక్కరూ కష్టపడి చేశారని ఆమె అన్నారు. కాగా, దుబాయ్ లో నిన్న నిర్వహించిన ‘రోబో 2.0’ ఆడియో వేడుకలో లతా రజనీకాంత్, కుమార్తెలు సౌందర్య, ఐశ్వర్య, అల్లుడు ధనుష్ కూడా పాల్గొన్నారు. 

  • Loading...

More Telugu News