కేన్సర్: కేన్సర్ వ్యాధి నుంచి బయటపడ్డ గౌతమి ఓ పోరాటయోధురాలు: హీరో బాలకృష్ణ

  • గౌతమి సంస్థ ‘లైఫ్ ఎగైన్’ ఆధ్వర్యంలో రేపు ‘విశాఖ’ లో ‘విన్నర్స్ వాక్’ ర్యాలీ
  • ర్యాలీలో పాల్గొననున్న బాలకృష్ణ
  • మీడియాతో మాట్లాడిన బాలయ్య

కొన్నేళ్ల పాటు కేన్సర్ వ్యాధి బారిన పడి దాని నుంచి బయటపడ్డ సినీ నటి గౌతమి ఓ పోరాటయోధురాలని హీరో బాలకృష్ణ ప్రశంసించారు. గౌతమి సంస్థ ‘లైఫ్ ఎగైన్’ విశాఖపట్టణంలో రేపు ‘విన్నర్స్ వాక్’ పేరిట ఓ ర్యాలీని నిర్వహించనుంది. కేన్సర్ వ్యాధిపై ప్రజలను చైతన్యపరిచే నిమిత్తం నిర్వహించనున్న ఈ ర్యాలీలో బాలకృష్ణ పాల్గొననున్నారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ, కేన్సర్ వ్యాధి బారినపడ్డ గౌతమి భగవంతుడి ఆశీస్సుల వల్ల, ఆమె పట్టుదల వల్ల దాని నుంచి బయటపడ్డారు. ‘ఐ డోంట్ సే షీ ఈజ్ ఏ సర్ వైవర్ బట్ ఏ ఫైటర్’ అని కొనియాడారు. కేన్సర్ వ్యాధి బారిన పడ్డవారు ధైర్యంగా ఉండి, ఆ వ్యాధి నుంచి   బయటపడాలని సూచించారు. తమ బసవతారకం కేన్సర్ ఆసుపత్రితో ‘లైఫ్ ఎగైన్’ సంస్థ చేతులు కలిపి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. విశాఖలోని కాళీమాత ఆలయం నుంచి వైఎంసీ వరకూ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు బాలకృష్ణ పేర్కొన్నారు. 

  • Loading...

More Telugu News