revan: అందరూ వెంటనే నా దగ్గరికి రండి... టీటీడీపీ నేతలకు చంద్రబాబు ఆదేశం!
- ఉదయం 11 గంటలకు సమావేశం
- లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో మీటింగ్
- రేవంత్ రేపిన చిచ్చుపైనే ప్రధాన చర్చ
తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగుదేశం పార్టీ నేతలంతా వెంటనే తన వద్దకు రావాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశించారు. లండన్, దుబాయ్ పర్యటనలను ముగించుకుని వచ్చిన ఆయన, ఈ ఉదయం 11 గంటలకు నేతలంతా వచ్చి తనతో మాట్లాడేందుకు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కు రావాలని సూచించారు. కాగా, ఇటీవలి కాలంలో పార్టీలో రేవంత్ రేపిన చిచ్చుపైనే ప్రధానంగా చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. గత వారం రేవంత్ ఢిల్లీ వెళ్లిన తరువాత జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్న తరువాత చంద్రబాబు తదుపరి ఆదేశాలు ఇస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.