కర్ణాటక స్వామిజీ: కర్ణాటక స్వామిజీ రాసలీలలు బట్టబయలు!

  • మద్దేవనపురం మఠాధిపతి నంజీశ్వర్ స్వామిజీ రాసలీలలు
  • ఆ మహిళ ఓ సినీనటి?
  • రహస్య కెమెరా ద్వారా బట్టబయలైన వ్యవహారం
  • మండిపడుతున్న భక్తులు

కర్ణాటకకు చెందిన ఓ స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు .. యలహంకలోని మద్దేవనపురంలో ఓ మఠం ఉంది. ఆ మఠాధిపతి నంజీశ్వర్ స్వామీజీ.. మఠంలోని ఓ గదిలో ఓ మహిళతో రాసలీలలకు పాల్పడ్డారు. ఆ మహిళ ఓ సినీనటి అని తెలుస్తోంది. కాగా, ఓ రహస్య కెమెరా ద్వారా స్వామీజీ రాసలీలల వ్యవహారం బయటపడింది. దీంతో, కర్ణాటకలోని స్థానిక టీవీ ఛానెళ్లలో స్వామి వారి రాసలీలల దృశ్యాలను ప్రసారం చేస్తున్నట్టు సమాచారం. స్వామీజీ వ్యవహారంపై భక్తులు మండిపడుతున్నారు.

ఈ సందర్భంగా బెంగళూరు సిటీ ఈశాన్య జోన్ డీసీపీ గిరీశ్ మాట్లాడుతూ, ఈ సంఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఫిర్యాదు అందితే చర్యలు చేపడతామని చెప్పారు. సుమారు ఐదొందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ మఠం కింద 220 ఎకరాల భూమి ఉన్నట్టు తెలిపారు.
 
ఆ మఠాధిపతి గురించి చెప్పాలంటే.. పర్వతరాజ్ శివాచార్య స్వామి కుమారుడు నంజీశ్వర్ స్వామిజీ అలియాస్ దయానంద్. 2011లో ఈ మఠానికి పీఠాధిపతి కావాలని విఫలయత్నం చేశాడు. ఆ తర్వాతే తన పేరును నంజీశ్వర్ స్వామీజీగా మార్చుకుని క్రమంగా మఠాధిపతి అయ్యాడు. ఈ మఠానికి సంబంధించిన భూములను దుర్వినియోగం చేయడం, మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఆయనకు కొత్తేమీ కాదని కొంతమంది భక్తుల ఆరోపణ.

  • Loading...

More Telugu News