టీఆర్ఎస్: వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం: సీఎం కేసీఆర్‌

  • టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో మాట్లాడిన కేసీఆర్
  • 96 నుంచి 104 స్థానాల్లో విజయం సాధిస్తాం
  • తొంభై తొమ్మిది శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకే మళ్లీ టిక్కెట్లు
  • నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం
  • పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదు

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని, 96 నుంచి 104 స్థానాల్లో విజయం సాధిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో వ్యవహరించాల్సిన తీరుపై పార్టీ ఎమ్మెల్యేలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ప్రతిపక్షాల దగ్గర సత్తా లేదని చెప్పి మనం అలసత్వం వహించొద్దని, అసెంబ్లీలో ప్రస్తావించే అన్ని అంశాలపై వాదన స్పష్టంగా ఉండాలని, ఎమ్మెల్యేలందరూ ప్రిపేరై అసెంబ్లీకి రావాలని కేసీఆర్‌ సూచించారు.

పార్టీలో వర్గ రాజకీయాలను ప్రోత్సహించే ప్రసక్తే లేదని, వచ్చే ఎన్నికల్లో తొంభై తొమ్మిది శాతం సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టిక్కెట్లు ఇవ్వనున్నట్టు చెప్పారు. అసెంబ్లీలో పార్టీ విప్ లు సమన్వయంతో వ్యవహరించాలని, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎమ్మెల్సీలు కలగజేసుకోవద్దని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. తరచుగా ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసుకోవడం మానుకోవాలంటూ ఎమ్మెల్సీ భూపతిరెడ్డిపై కేసీఆర్ అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, గుజరాత్ ఎన్నికల తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని చెప్పారు.

  • Loading...

More Telugu News