యోగి ఆదిత్యనాథ్ : తాజ్ మహల్ వద్ద చీపురు పట్టుకుని ఊడ్చిన యోగి ఆదిత్యనాథ్.. విమర్శించిన అసదుద్దీన్ ఒవైసీ
- ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తొడిగిన యోగి ఆదిత్యనాథ్
- తాజ్‌మహల్‌పై వివాదం చెలరేగుతోన్న నేపథ్యంలో యోగి స్వచ్ఛభారత్
- బీజేపీ నేతల మెదళ్లని శుభ్రపర్చితే బాగుంటుంది: అసదుద్దీన్
తాజ్‌మహల్ విషయంలో మాటల తూటాలు పేలుతోన్న నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ రోజు ఆ చారిత్రక కట్టడాన్ని సందర్శించారు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం తమ కార్యకర్తలతో అక్కడకు చేరుకున్న ఆయన.. తాజ్‌మహల్ పశ్చిమ గేటు ఎదుట చీపురు చేత పట్టుకొని రోడ్లు ఊడ్చారు. ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తొడిగి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కాగా, యోగి ఆదిత్యనాథ్ తాజ్ మహల్ వద్ద స్వచ్ఛభారత్ కార్యక్రమం నిర్వహించడం పట్ల హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు. తాజ్ మహల్ వద్ద రోడ్లు ఊడ్చే పని చేయడం కన్నా యోగి ఆదిత్యనాథ్ తన పార్టీ నేతల, తన కేబినెట్ మంత్రుల మెదళ్లని శుభ్రపర్చితే బాగుంటుందని అసదుద్దీన్ ఎద్దేవా చేశారు.