క్రికెట్: టీమిండియా విజయ లక్ష్యం 231 పరుగులు

  • నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 230 పరుగులు
  • న్యూజిలాండ్ బ్యాట్స్ మెన్ లో హెన్రీ నికోల్స్ 42, గ్రాంధోమీ 41 పరుగులు
  • టీమిండియా బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ కు 3 వికెట్లు

పూణేలో జ‌రుగుతోన్న భార‌త్‌, న్యూజిలాండ్ రెండో వ‌న్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. టీమిండియా ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. న్యూజిలాండ్ బ్యాట్స్‌మెన్‌ మార్టిన్ గుప్తిల్ 11, కోలిన్ మున్‌రో 10, కానె విలియ‌మ్స‌న్ 3, టైల‌ర్ 21, టామ్ లాథ‌మ్ 38, హెన్రీ నికోల్స్ 42, గ్రాంధోమీ 41, ఆడ‌మ్ మిల్నీ 0, శాంట‌ర్ 29, టిమ్ సౌతీ 25, బౌల్ట్ 2 ప‌రుగులు చేశారు. దీంతో న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసింది. టీమిండియా బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ 3 వికెట్లు తీయ‌గా, యు‌జ్వేంద్ర చాహ‌ల్, బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా, అక్స‌ర్ ప‌టేల్‌ చెరో వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News