జగన్: మీ ఆఫీసుకి వస్తా.. చర్చకు సిద్ధమేనా?: జగన్ కు సవాల్ విసిరిన అచ్చెన్నాయుడు
- బీసీల సంక్షేమంపై చర్చించేందుకు వైసీపీ కార్యాలయానికి వస్తా.. జగన్ సిద్ధమేనా?
- బీసీల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంది
- మీడియాతో మాట్లాడిన అచ్చెన్నాయుడు
వైసీపీ అధినేత జగన్ కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. బీసీల సంక్షేమంపై చర్చించేందుకు తాను వైసీపీ కార్యాలయానికి వస్తానని, అందుకు, జగన్ సిద్ధమేనా? అని ఆయన సవాల్ విసిరారు. బీసీల అభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం కట్టుబడి ఉందని, బీసీల గురించి మాట్లాడే అర్హత జగన్ కు లేదని ఆయన విమర్శించారు.
జగన్ చేపట్టనున్న పాదయాత్రపైనా అచ్చెన్నాయుడు విమర్శలు గుప్పించారు. జగన్ పాదయాత్ర కాదు, పొర్లు దండాలు పెట్టినా లాభం లేదని, ప్రజలు ఆయన్ని నమ్మే పరిస్థితిలో లేరని, కోర్టు కేసుల నుంచి జగన్ తప్పించుకోలేడని అన్నారు. జగన్ చరిత్ర ఏంటో ప్రతి ఒక్కరికీ తెలుసుని, టీడీపీ ఎమ్మెల్యేగా తానీ విమర్శలు చేయడం లేదని అన్నారు. పలు కేసుల్లో జగన్ నిందితుడని తాను చెప్పడం కాదని, సీబీఐ చార్జిషీట్లే అందుకు నిదర్శనమని అచ్చెన్నాయుడు అన్నారు.