పవన్ కల్యాణ్: సీన్ రివర్స్.. అభిమానితో స్వయంగా సెల్ఫీ తీసుకుని పోస్ట్ చేసిన పవన్ కల్యాణ్!

  • సామాజిక, ఆర్థిక ప‌రివ‌ర్త‌న కోసం నిరంత‌రం ప‌నిచేస్తాడని పేర్కొన్న పవన్
  • అలుపెరుగ‌ని కార్య‌క‌ర్త నిమ్మ‌ల వీర‌న్న‌తో సెల్ఫీ తీసుకున్నానని చెప్పిన జనసేనాని

సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో క‌లిసి ఫొటోలు దిగ‌డానికి అభిమానులు ఎంత‌గా పోటీ ప‌డ‌తారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయ‌న‌తో సెల్ఫీ తీసుకుని ఆనందంతో గంతులు వేస్తూ గ‌ర్వంగా దాన్ని సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే, ఈ రోజు ప‌వ‌న్ కల్యాణ్ త‌మ కార్య‌క‌ర్త‌తో స్వ‌యంగా సెల్ఫీ తీసుకుని త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

 ‘సామాజిక, ఆర్థిక ప‌రివ‌ర్త‌న కోసం నిరంత‌రం ప‌నిచేసే, అలుపెరుగ‌ని కార్య‌క‌ర్త మా నిమ్మ‌ల వీర‌న్న‌తో..’ అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జనసేన సైనికుల సంఖ్యను పెంచుకోవడం, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలపై దృష్టి పెట్టిన పవన్ కల్యాణ్ అందుకోసం తమ కార్యకర్తలను కలుస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు.
 

  • Loading...

More Telugu News