గరుడ వేగ: ‘గరుడ వేగ’లో నన్ను జేమ్స్ బాండ్ పాత్రలో చూస్తారు!: హీరో రాజశేఖర్

  • ‘గరుడ వేగ’లో ‘ప్రేమ లే..’ పాట ఆవిష్కరణ
  • ఈ చిత్రం ఇండియన్ హాలీవుడ్ ఫిల్మ్
  • నన్ను జేమ్స్ బాండ్ పాత్రలో చూడబోతున్నారు: రాజశేఖర్

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కనున్న‘గరుడ వేగ’ చిత్రం తనకు మంచి పేరు తీసుకువస్తుందని ఈ చిత్రం హీరో రాజశేఖర్ అన్నారు. ప్రముఖ ఎఫ్ఎం ఛానెల్ ‘రేడియో సిటీ’ వేదికగా ‘గరుడ వేగ’ చిత్రంలో రెండో పాట ‘ప్రేమలే..’ ను రాజశేఖర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘‘గరుడ వేగ’ చిత్రం నాకే కాదు, చిత్ర యూనిట్ మొత్తానికి మంచి పేరు వస్తుంది. ఈ సినిమాలో నేను డిఫరెంట్ రోల్ లో కనిపించడానికి కారణం దర్శకుడు ప్రవీణ్ సత్తారు.

మన జీవితంలో చూస్తున్న సంఘటనల మాదిరే, చాలా సహజంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం గురించి క్లుప్తంగా చెప్పాలంటే.. ఇది ఇండియన్ హాలీవుడ్ ఫిల్మ్. ఈ చిత్రంలో నన్ను జేమ్స్ బాండ్ పాత్రలో చూపించారు. ఈ పాత్రను ప్రేక్షకులు, నా అభిమానులు బాగా ఇష్టపడతారు. ఈ సినిమా నా కెరీర్ లోనే పెద్ద బడ్జెట్ ఫిల్మ్’ అని చెప్పుకొచ్చారు. కాగా, ఈ కార్యక్రమానికి రాజశేఖర్ తో పాటు ఆయన సతీమణి జీవిత, కూతురు హాజరయ్యారు.

  • Loading...

More Telugu News