లండన్ లో చంద్రబాబు: రాజధాని తుది ఆకృతుల పరిశీలన.. లండన్‌లో చంద్రబాబు బృందం బిజీబిజీ
- నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో భేటీ
- తుది నమూనాలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపే అవకాశం
- విదేశీ పర్యటనలో భాగంగా లండన్ లో చంద్రబాబు
విదేశీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బృందం ప్రస్తుతం లండన్‌లో ఉంది. ఏపీకి పెట్టుబడులు రాబట్టడం, రాజధాని నిర్మాణానికి తుది ఆకృతులను పరిశీలించడంలో చంద్రబాబు నాయుడు బిజీగా ఉన్నారు. అమరావతిలో నిర్మించే శాశ్వత అసెంబ్లీ భవనం, హైకోర్టు భవనాలకు తుది డిజైన్‌లను ఆయన పరిశీలిస్తున్నారు. నార్మన్ ఫోస్టర్ సంస్థ ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. తుది నమూనాలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపే అవకాశం ఉంది. అలాగే, లండన్ నుంచి పెట్టుబడులకు ఆసక్తి చూపుతోన్న సంస్థలకు ఇక్కడ ఉన్న పెట్టుబడుల అవకాశాలను చంద్రబాబు బృందం వివరించనుంది.