రమణ: సొంత పనిపై ఢిల్లీ వెళుతున్నట్టు రేవంత్ రెడ్డి చెప్పారు.. అంతే!: టీటీడీపీ నేత ఎల్. రమణ

  • ఢిల్లీలో పరిణామాలు మీడియా ద్వారానే తెలిశాయి
  • పార్టీ లైన్ లో లేని వారిని తప్పిస్తాం
  • పాత్రికేయులతో రమణ

టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి పార్టీ మారుతున్న వ్యవహారంపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ మాట్లాడుతూ, సొంత పనిపై ఢిల్లీ వెళుతున్నట్టు రేవంత్ రడ్డి తనకు చెప్పారు కానీ, ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలు మాత్రం మీడియా ద్వారానే తనకు తెలిశాయని అన్నారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి తామందరం వెళ్దామని అనుకున్నాం కానీ, జరిగిన పరిణామాల నేపథ్యంలో పార్టీ శాసనసభాపక్ష భేటీకి వెళ్లే విషయమై పునరాలోచిస్తామని, పార్టీ లైన్ లో లేనివారిని తప్పిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News