ఏపీ: నవంబర్ 10 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. బాయ్ కాట్ యోచనలో వైసీపీ?

  • అసెంబ్లీ సిబ్బందితో సమావేశమైన స్పీకర్ కోడెల 
  • పది పని దినాల్లో సమావేశాలు నిర్వహించాలని యోచన
  • అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉండాలని చూస్తున్న వైసీపీ?

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నవంబర్ 10 నుంచి ప్రారంభం కానున్నాయి. పది పని దినాల్లో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ సందర్భంగా అసెంబ్లీ సిబ్బందితో స్పీకర్ కోడెల శివప్రసాద్ సమావేశమయ్యారు.

ఇదిలా ఉండగా, అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించే యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునే వరకు అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకూడదని వైసీపీ నిర్ణయం తీసుకున్నట్టు ఆ పార్టీ వర్గాల సమాచారం. ఈ నెల 26న జరగనున్న వైసీఎల్పీ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News