యూఏఈ అధ్యక్షుడు: యూఏఈ అధ్యక్షుడి అల్లుడిని కలిసిన చంద్రబాబు!
- ఏపీలో అవకాశాల గురించి వివరించిన చంద్రబాబు
- సహకారం అందించాలని వినతి
- సానుకూలంగా స్పందించిన అల్లుడు తహ్నౌన్
ఏపీ సీఎం చంద్రబాబు యూఏఈలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో యూఏఈ అధ్యక్షుడి అల్లుడు షేర్ హమీద్ బిన్ తహ్నౌన్ అల్ నహ్యాన్ ని చంద్రబాబు కలిశారు. ఏపీలో ఉన్న అవకాశాలు, వనరుల గురించి ఆయనకు వివరించారు. కొత్త రాష్ట్రం అభివృద్ధికి సహకారం అందించాలని చంద్రబాబు కోరారు. చంద్రబాబు వినతికి తహనౌన్ సానుకూలంగా స్పందించినట్టు సమాచారం. అంతకుముందు, గల్ఫ్ వ్యాపార దిగ్గజం డాక్టర్ బీఆర్ షెట్టితో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.