జియో ఫోన్‌: ఛార్జింగుకి పెట్టిన జియో ఫోన్‌ పేలుడు!

  • కశ్మీర్‌ లో ఘటన
  • జియో ఫోన్ లను అందుకుంటోన్న వినియోగదారులు
  • జియో ఫీచర్‌ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించామ‌న్న రిలయన్స్‌ రీటైల్

జియో ఫోన్‌ల బుకింగ్స్ ప్రారంభం కావ‌డ‌మే ఆల‌స్యం.. వాటికి ఊహించ‌ని విధంగా స్పంద‌న వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా మంది ఆ ఫోన్‌ల‌ను అందుకున్నారు. కాగా, కశ్మీర్‌ లో ఛార్జింగ్ పెట్టిన‌ ఒక జియో ఫోన్ పేలిపోయింద‌ని తెలిసింది. దీంతో ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక భాగం పూర్తిగా కాలిపోగా, బ్యాటరీకి మాత్రం ఏమీ కాలేదు. దీనిపై స్పందించిన‌ రిలయన్స్‌ రీటైల్ ప్ర‌తినిధులు ఈ విష‌యం గురించి త‌మ‌కు తెలిసింద‌ని, తాము మాత్రం జియో ఫీచర్‌ ఫోన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందించామ‌ని తెలిపారు.

తాము ప్రతీ ఫోన్‌ను క్షుణ్ణంగా పరీక్షించిన త‌రువాతే విడుద‌ల చేశామ‌ని చెప్పారు. ఈ ఫోన్ పేలుడు అంశం కావాలని సృష్టించిన వివాదమేన‌ని అన్నారు. తాము తదుపరి పరిశోధనల ఆధారంగా తగిన చర్య తీసుకుంటామని లైఫ్ డిస్ట్రిబ్యూటర్ పేర్కొంది. ఈ పేలుడికి కార‌ణం బ్యాటరీ కాదని, పేలుడు తర్వాత కూడా యూనిట్ బ్యాటరీ ఇప్పటికీ పనిచేస్తోందని చెప్పింది. 

  • Loading...

More Telugu News