: మనిషి కుక్కను కరిచాడు!


పాత్రికేయ శిక్షణార్థులకు తరగతి గదిలో మొదట ఏం చెబుతారో తెలుసా..? వార్తను ఎంచుకునేటప్పుడు ఎలాంటి విషయాలకు ప్రాధాన్యం ఇవ్వాలో విడమర్చుతూ..'కుక్క మనిషిని కరిస్తే వార్త కాదు, మనిషి కుక్కను కరిస్తే వార్త' అంటూ ఉదహరిస్తారు. సరిగ్గా వాస్తవంలోనూ ఇలాగే జరిగింది. చికాగోలో ఓ వ్యక్తి నిజంగానే కుక్కను కరిచి వార్తల్లోకెక్కాడు.

గ్రిమ్స్ ప్రాంతంలో కరెన్ అనే మహిళ తన పెంపుడు కుక్క 'కాండీ'ని తీసుకుని వాహ్యాళికి బయల్దేరింది. కొంతదూరం వెళ్ళారో లేదో.. ఓ పెద్ద లాబ్రడార్ జాతి శునకం వీరిపై దాడి చేసింది. పరుగున వచ్చి కరెన్ ను కిందపడేసి ఆమె ముఖమంతా కరిచింది. ఇక ఆమెను వదిలేసి 'కాండీ' వెంటపడింది. ఇది చూసిన కరెన్ భర్త హెన్రీ పరుగుపరుగున వచ్చి ఒక్కదుటున 'లాబ్రడార్' ను పట్టుకుని కసిదీరా కరిచాడు. దీంతో, అది కుయ్యోమొర్రో అంటూ పరుగు లంకించుకుందట.

అనంతరం ఈ దంపతులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని తమ ఇంటికి చేరారు. కుక్కను కరవడంపై హెన్రీ వివరణ ఇస్తూ.. భార్య ముఖంపై రక్తం చూడడంతోనే పట్టరాని ఆవేశం కలిగిందని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News