విశాఖలో కలకలం... నడిరోడ్డుపై యాచకురాలిపై అత్యాచారం, వినోదం చూస్తూ వీడియో తీసుకున్న జనం!
- తలదించుకున్న సభ్య సమాజం
- నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- కేసును విచారిస్తున్నామని వెల్లడి
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, స్టేషన్ పరిసరాల్లో అడుక్కుంటూ జీవిస్తున్న ఓ మతిస్థిమితం లేని యువతిపై, రైల్వే న్యూ కాలనీకి చెందిన గంజి శివ (25) మద్యం తాగి వచ్చి అత్యాచారానికి దిగాడు. అటుగా వెళుతున్న వారు ఈ ఘటనను చూశారే తప్ప, ఎవరూ అడ్డుకోలేదు. ఆటో డ్రైవర్ అర్జి శ్రీను ఘటనను వీడియో తీస్తూ పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఆపై గంజి శివను అరెస్ట్ చేశామని, బాధితురాలిని ఆసుపత్రికి తరలించామని, కేసును విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.