ప్రభాస్: ప్రభాస్ గురించి మూడే మూడు మాటలు చెబుతాను!: కృష్ణంరాజు

  • అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్ ప్రభాస్
  • తన సుఖం కోసం ఆలోచించడు
  • కథ బాగుందో లేదో చెప్పడంలో ప్రభాస్ పర్ఫెక్ట్  
  • మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడడు  

ప్రభాస్ తన వారసుడని చెప్పుకోవడానికి గర్వపడుతున్నానని అన్నారు ఆయన పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రభాస్ గురించి మూడే మూడు మాటలు చెబుతాను. ఒకటి... అంకిత భావంతో పని చేసే ఆర్టిస్ట్. ప్రభాస్ తన సుఖం గురించి ఆలోచించని వ్యక్తి. రెండు.. సినిమాకు సంబంధించిన కథను ప్రతి హీరో వింటాడు. ఆ కథ విన్న తర్వాత అది బాగుందో? లేదో? చెప్పడం మామూలు విషయం కాదు. అలా జడ్జ్ చేయడంలో ప్రభాస్ పర్ఫెక్ట్. ఏదైనా కథను వింటే .. దానిని ఏ స్థాయికి తీసుకువెళ్లొచ్చు, ఎలా తీసుకువెళ్లొచ్చనేది ప్రభాస్ ఆలోచిస్తాడు. మూడోది.. పర్సనల్ క్యారెక్టర్. మన మధ్య లేని వ్యక్తి గురించి మాట్లాడే తత్వం ప్రభాస్ కు లేదు. ఇంకా, ప్రభాస్ గురించి నేను చెప్పాల్సింది ఏమీ లేదు.. అయామ్ వెరీ వెరీ హ్యాపీ’ అన్నారు.

  • Loading...

More Telugu News