ప్రభాస్: పెద్ద మొత్తంలో డబ్బులిస్తానన్నా ప్రభాస్ నటించ లేదు: కృష్ణంరాజు

  • తెలుగు, హిందీ భాషల్లో సినిమా తీస్తానంటూ ఒకళ్లు వచ్చారు
  • ఎవరూ ఊహించనంత డబ్బులిస్తామని చెప్పారు
  • కథ మీద, నిర్మాత మీద నమ్మకం కలిగితేనే చేస్తానన్నాడు 

ఈ మధ్య కాలంలో ప్రభాస్ వద్దకు ఒకరు వచ్చి పెద్ద మొత్తంలో డబ్బులిస్తాం నటించమని అడిగితే, అందుకు అతను ఒప్పుకోలేదని ప్రభాస్ పెదనాన్న, సీనియర్ నటుడు కృష్ణంరాజు చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘ప్రభాస్ ను హీరోగా పెట్టి తెలుగు, హిందీలో సినిమా తీస్తామని ఈ మధ్య ఒకళ్లు వచ్చారు. ఎవరూ ఊహించనంత డబ్బులు ప్రభాస్ కు ఇస్తామన్నారు. ‘రెండు, మూడు సినిమాలకు సరిపడా డబ్బులు ఇస్తావు సరే, ఈ సినిమా నువ్వు సరిగా తీయకపోతే? డబ్బులిచ్చాను కదా అనుకుని నీ ఇష్టమొచ్చినట్టు తీస్తే? నాకు కావాల్సింది నీ డబ్బు కాదు. నువ్వు, నీ కథ. ఫస్ట్ నాకు కథ వినిపించు. కథ మీద, నీ మీద నమ్మకం ఉంటే నేను నటిస్తా’ అని వచ్చిన వ్యక్తికి ప్రభాస్ చెప్పాడు’ అని కృష్ణంరాజు చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News