నాల్గో వికెట్: నాల్గో వికెట్ కోల్పోయిన భారతజట్టు!

  • సౌథీ బౌలింగ్ లో కార్తీక్ (37) అవుట్
  • క్రీజ్ లో కొనసాగుతున్న కోహ్లీ-ధోనీ
  • 60 పరుగులు చేసిన కోహ్లీ

వాంఖడే స్టేడియం వేదికగా భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా నాల్గో వికెట్ కోల్పోయింది. న్యూజిలాండ్ బౌలర్ సౌథీ బౌలింగ్ లో మున్రోకు కార్తీక్ (37) క్యాచ్ ఇచ్చాడు. కోహ్లీ, కార్తీక్ భాగస్వామ్యం నిలకడగా కొనసాగడంతో స్కోరు బోర్డును ముందుకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం క్రీజ్ లో కోహ్లీ 60 పరుగులు చేయగా, ధోనీ 4 పరుగులు చేశాడు. ఇప్పటి వరకు కోహ్లీ 4 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. 30.2 ఓవర్లలో టీమిండియా స్కోర్: 150/4

  • Loading...

More Telugu News