krish: 'మహానటి' కోసం దర్శకుడు కేవీ రెడ్డి పాత్రలో క్రిష్ .. సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్

  • కీర్తి సురేశ్ ప్రధాన పాత్రగా 'మహానటి'
  • జెమిని గణేశన్ పాత్రలో దుల్కర్ సల్మాన్
  • ఎస్వీఆర్ గా మోహన్ బాబు
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న తాజా సమాచారం      

సావిత్రి జీవితచరిత్రగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'మహానటి' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సావిత్రిగా కీర్తి సురేష్ నటిస్తుండగా, ఆమె భర్త జెమినీ గణేశన్ పాత్రను దుల్కర్ సల్మాన్ పోషిస్తున్నాడు. చక్రపాణి పాత్రలో ప్రకాశ్ రాజ్ .. ఎస్వీఆర్ పాత్రలో మోహన్ బాబు కనిపించనున్నారు.

'మాయాబజార్'లోని 'వివాహ భోజనంబు .. వింతైన వంటకంబు' అనే పాటను కూడా మోహన్ బాబుపై చిత్రీకరించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. 'మాయాబజార్' సినిమాకి దర్శకత్వం వహించిన కె.వి.రెడ్డి పాత్రలో క్రిష్ .. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన సింగీతం శ్రీనివాసరావు పాత్రలో తరుణ్ భాస్కర్ కనిపించనున్నారనేది తాజా సమాచారం. మొత్తానికి 'మహానటి' సినిమా నటీనటుల ఎంపికతోనే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది .. ఆసక్తిని రేకెత్తిస్తోంది.    

  • Error fetching data: Network response was not ok

More Telugu News