యువకుడి దాడి: పాలిటెక్నిక్ రెండో సంవత్సర విద్యార్థినిపై మద్యం సీసాతో యువకుడి దాడి
- ఆదిలాబాద్ లోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఘటన
- తనను ప్రేమించాలని యువతి వెంటపడిన విద్యార్థి గోవర్ధన్
- ఒప్పుకోకపోవడంతో అఘాయిత్యం
అమ్మాయిలపై జరుగుతోన్న దాడులను నిరోధించడానికి ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ అఘాయిత్యాలకు మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. ఈ క్రమంలో ఈ రోజు ఆదిలాబాద్‌లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలో రెండవ సంవత్సర విద్యార్థినిపై గోవర్ధన్ అనే విద్యార్థి దాడికి పాల్పడ్డాడు.
తనను ప్రేమించాలంటూ వెంటపడిన గోవర్ధన్ ప్రేమను ఆ యువతి అంగీకరించలేదు. దీంతో తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఆ యువకుడు మద్యం సీసాతో ఆమెపై దాడి చేశాడు. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.