ట్రక్కు: కోడిగుడ్ల లోడుతో వెళుతోన్న ట్రక్కును ఢీ కొట్టిన బస్సు.. గుడ్ల కోసం ఎగబడ్డ స్థానికులు
- కర్ణాటకలోని తుముకూరులో ఘటన
- కోడి గుడ్లన్నీ రోడ్డుపాలు
- ట్రక్కులోని 6 లక్షల రూపాయల విలువైన కోడిగుడ్లు డ్యామేజ్
కోడిగుడ్ల లోడుతో వెళుతోన్న ఓ ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటన కర్ణాటకలోని తుముకూరులో చోటు చేసుకుంది. ఈ ఘటన కారణంగా ట్రక్కులోని కోడి గుడ్లన్నీ రోడ్డుపై పడిపోయాయి. అందులో అధిక శాతం పగిలిపోయి రోడ్డంతా అవే కనిపించాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు ప్లాస్టిక్ కవర్లు చేత పట్టుకుని ఆ ప్రాంతానికి చేరుకొని కోడిగుడ్లను ఏరుకోవడానికి ఎగబడ్డారు.
ఈ ఘటనలో ట్రక్కులోని 6 లక్షల రూపాయల విలువైన కోడిగుడ్లు రోడ్డుపాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో ఎవ్వరికీ గాయాలు కాలేదు.