రేవంత్‌రెడ్డి: రేవంత్‌రెడ్డి బయటపెట్టిన విషయాలపై టీడీపీ స్పందించాలి: మల్లాది విష్ణు

  • అలాగే, పోలవరం ప్రాజెక్టులో సీఎం రమేష్‌ కాంట్రాక్టు దక్కించుకున్నాడా? లేదా? అనే విషయం చెప్పాలి
  • యనమల బంధువు సుధాకర్‌ యాదవ్ కాంట్రాక్టు దక్కించుకున్నాడా? లేదా?
  • అన్ని విషయాలపై ఏపీ స‌ర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలి

పార్టీ మారతాన‌ని సంకేతాలు ఇస్తోన్న టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి బయటపెట్టిన విషయాలపై టీడీపీ సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు డిమాండ్ చేశారు. ఈ రోజు విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. అలాగే, పోలవరం ప్రాజెక్టులో టీడీపీ ఎంపీ సీఎం రమేష్‌ కాంట్రాక్టు దక్కించుకున్నారా? లేదా? అనే విష‌యాన్ని కూడా టీడీపీ బ‌య‌ట చెప్పాల‌ని అడిగారు.

ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడి బంధువు సుధాకర్‌ యాదవ్ కూడా కాంట్రాక్టు దక్కించుకున్నార‌ని ఆరోపించారు. ఈ అంశాల‌తో పాటు రాజ‌ధాని నిర్మాణం, చంద్ర‌బాబు విదేశీ పర్యటనలపై కూడా రాష్ట్ర స‌ర్కారు శ్వేతపత్రం విడుదల చేయాలని మ‌ల్లాది విష్ణు డిమాండ్‌ చేశారు. పోలవరం ప్రాజెక్టులో జ‌రుగుతోన్న‌ అక్రమాలపై తాము ప్రశ్నిస్తే టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తూ త‌మ పార్టీ అధినేత‌ జగన్‌పై అస‌త్య‌ ప్రచారం చేస్తున్నారని ఆయ‌న అన్నారు.

  • Loading...

More Telugu News