: జగన్ బయటికొస్తే సాక్ష్యాలు గల్లంతే: సుప్రీంలో సీబీఐ వాదన
అక్రమాస్తుల కేసులో ప్రధాన నిందితుడు వైఎస్ జగన్ జైలు నుంచి బయటికొస్తే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీబీఐ నేడు సుప్రీం కోర్టులో వాదించింది. జగన్ బెయిల్ పిటిషన్ పై సుప్రీం ఈరోజు విచారణ జరిపింది. సీబీఐ, జగన్ వర్గం తమ వాదనలను బలంగా వినిపించాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును పెండింగ్ లో ఉంచింది. కాగా, తన వాదనల్లో భాగంగా సీబీఐ.. అవినీతి కేసులో దర్యాప్తు పూర్తి చేసేందుకు మరో నెలన్నర సమయం పడుతుందని, ఏ1 నిందితుడు జగన్ కు ఈ తరుణంలో బెయిలిస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తారని అభిప్రాయపడింది. పైగా, ఏ2గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పటికే సాక్ష్యులను బెదిరింపులకు గురిచేస్తున్నారని సీబీఐ పేర్కొంది.