ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కు తీవ్ర అస్వస్థత.. నిమ్స్ ఆసుపత్రికి తరలింపు

  • శంషాబాద్‌లోని ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లిన ప్రకాశ్ గౌడ్
  • అక‌స్మాత్తుగా కుప్పకూలిపోయిన ఎమ్మెల్యే
  • పరామర్శించిన మంత్రి మహేందర్ రెడ్డి 

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అస్వస్థతకు గురి కావ‌డంతో ఆయ‌న‌ను నిమ్స్ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ఈ రోజు సాయంత్రం ఆయ‌న శంషాబాద్‌లోని ఓ హోటల్ ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ ఉన్న‌ట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆయ‌న‌ను వెంటనే శంషాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంత‌రం అక్క‌డి నుంచి నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ విష‌యం తెలుసుకున్న తెలంగాణ మంత్రి మ‌హేంద‌ర్ రెడ్డి ఆసుప‌త్రికి వెళ్లి ఎమ్మెల్యే ప్ర‌కాశ్ గౌడ్‌ను ప‌రామ‌ర్శించారు. ఈ ఘ‌ట‌న‌పై మ‌రింత స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News